యువతకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి…
– మెదక్ ఎమ్మెల్సీ అభ్యర్థి గుండు ప్రవీణ్ కుమార్
పటాన్ చెరు:
బీసీ వర్గానికి చెందిన యువతకు ఎమ్మెల్సీ అవకాశాలు కల్పించాలని మెదక్ ఎమ్మెల్సీ అభ్యర్థి గుండు ప్రవీణ్ కుమార్ ముదిరాజ్ అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలను రాజకీయంగా ఎదగనివ్వకుండా వెనుక పడేస్తున్నారు. బీసీలు రాజకీయంగా ఎదగాలి అనే ఉద్దేశంతో బిసి ముదిరాజ్ బిడ్డగా నామినేషన్ వేశాను. మీ అందరి ఆశీర్వాదం నా పై ఉండాలని కోరుకుంటున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మద్యం దుకాణాల నోటిఫికేషన్ తప్ప, ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోవడం పై మండిపడ్డారు.
