-మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు అందించాలి
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోని మీర్జాగూడ లో జరిగిన ఘోర రోడ్డు ఘటన పై ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రభుత్వం వెంటనే మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరారు. కంకర లోడ్ లారీకి టార్పాలిన్ కవర్ లాంటి ఏర్పాటు ఉంటే ఇంత స్థాయిలో ప్రమాదం జరిగేది కాదన్నారు. ప్రభుత్వం, రవాణా శాఖ ఇలాంటి ఏర్పాట్లు చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి లారీ, డీసీఎం లకు కచ్చితంగా ప్రమాదభీమా కల్పించేలా మార్గదర్శకాలు రూపొందించాలి. ఇలాంటి ఘటన లు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
