శేరిలింగంపల్లి , మనవార్తలు ప్రతినిధి :
ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్రా నాయకులు కలిసి కాంగ్రెస్ పార్టీ స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ చట్టం అమలు చేయాలనీ కోరుతూ జాగృతి అధ్యక్షురాలు ఏమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను తన నివాసంలొ కలిసి వినతి పత్రం అందజేశారు. తెలంగాణా ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్రా నాయకులు కలిసి కాంగ్రెస్ పార్టీ స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ చట్టం అమలు చేస్తామని మేనిఫెస్టో లొ పెట్టడం జరిగిందని, కావున మీరు అమలు అయ్యేల ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకోరావాలని కోరారు. ఎమ్మెల్సి సానుకూలంగా స్పందించారని శాసన మండలి లో తప్పకుండ ఈ అంశం పై మాట్లాడుతాను అని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లు సుధాకర్ నాయక్, సంగీత రెడ్డి, ఉపాధ్యక్షులు గిరి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు సంతోష్ కుమార్ గౌడ్ మరియు సంఘం ముఖ్య నాయకులు పాల్గొన్నారు.