శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి పై ఎమ్మెల్యే శ్వేత పత్రం విడుదల చేయాలి – కొరడాల నరేష్

Hyderabad politics Telangana

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : 

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ బాధ్యాయుతమైన స్థానం లో వుండి అబద్దాలు మాట్లాడుతున్నాడని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోరడల నరేష్ అన్నారు. గురువారం రోజు హాఫిజ్ పేట్ డివిజన్ లోని అల్విన్ కాలనీ వద్ద గల బిజెపి కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ 9 వేల కోట్ల తో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న అయన ఎక్కడ అభివృద్ధి చేసారో చెప్పాలని, ఖర్చు పెట్టిన నిధులు మీద శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కాకుండా కేంద్ర ప్రభుత్వo నిదులెన్ని, కార్పొరేటర్ల నిదులెన్ని, ఎంపీ నిదులెన్ని, జి హెచ్ ఎం సి నిదులెన్ని అని ప్రశ్నించారు. వాస్తవ పరిస్థితి కు భిన్నంగా ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడని, అన్ని నిధులు తానే తెచ్చి అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటూ, చెరువుల సుందరికరుణ పేరుతో కబ్జాలు చేశారని ఆరోపించారు. చిన్న వర్షం వస్తేనే రోడ్లు అన్ని నిండిపోతున్నాయని, ఎన్ని చెరువులు సుందరికరణ చేసారో చెప్పాలని, బడా బిల్డర్ కు అనుకూలంగా కింది కుంట చెరువును అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.

మియాపూర్ పటేల్ చెరువు సుందరికరణ పేరుతో నాలా మీద నిర్మాణాలు చేస్తున్నారని, చాలా కట్టాడాలు నాలా ల మీద కడుతున్నారని, ఏ ప్రత్తిపాధికనా ఖర్చు చేసారో చెప్పాలన్నారు. ఎమ్మెల్యే ఎన్ని నిధులు ఖర్చు చేసారో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.శేరిలింగంపల్లి నియోజకవర్గం తెలంగాణ లోనే అత్యధిక ఆదయం కలిగిన నియోజకవర్గమని, ఎలక్షన్ ల ముందు మరోసారి ప్రజలను మోసం చేస్తున్నాడని దుయ్యబట్టారు. ప్రభుత్వ స్థలాలను వేలం పాఠం లో అమ్ముతున్నారని, డబల్ బెడ్ రూమ్ లకు శేరిలింగంపల్లి ప్రజలు అర్హులు కారా, ఇల్లు లేని ప్రజలు ఏమైపోవాలని, ఒక్కరికైనా డబుల్ బెడ్ రూమ్ ఇప్పించడా, యువత కోసం ఒక్క స్టేడియం కట్టిన పాపాన పోలేదన్నారు. శేరిలింగంపల్లి ప్రజలకు చేసింది ఏమి లేదని, వాస్తవాలను ప్రజలకు చెప్పలని, తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని అయన డిమాండ్ చేసారు.నేను కూడా ఎమ్మెల్యే బరిలో ఉన్నా శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గా బిజెపి తరుపున బరిలో ఉన్నానని, తన సేవలు అధిష్టానం గుర్తించి అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు తెలిపారు. పార్టీ లో ఎవరికీ టికెట్ ఇచ్చినా కలసిపనిచేస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *