42 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
శర వేగంగా విస్తరిస్తున్న పటాన్చెరు డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం పటాన్చెరు పరిధిలోని పంచముఖి హనుమాన్ దేవాలయం నుండి ఆల్విన్ కాలనీ చౌరస్తా వరకు 12 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన విధి దీపాలను ప్రారంభించారు. అనంతరం 30 లక్షల రూపాయలతో సింఫనీ కాలనీ నుండి చిన్న వాగు వరకు చేపట్టనున్న పూడికతీత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములైనప్పుడే సార్థకత చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మల్లేష్ యాదవ్, నవీన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.