పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్‌చెరు డివిజన్ ను అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ నేతాజీ నగర్, సీతారామయ్య కాలనీ, గోకుల్ నగర్, తదితర కాలనీలలో ఐదు కోట్ల 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా సిసి రోడ్లు, పార్కులు, అంతర్గత మరుగు నీటి కాలువలు, విధి దీపాలు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. వీటితోపాటు మరో రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాలలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహా రెడ్డి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.