వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం:
జిన్నారం మున్సిపల్ కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం దేవాలయంలో ఆదివారం నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలలో భక్తి భావం పెంపొందించేలా నూతన ఆలయాలు నిర్మించడం హర్షించదగ్గ విషయం అన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గ వ్యాప్తంగా సొంత నిధులతో 200లపైగా దేవాలయాలు నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. జీవనజ్యోతి జ్యోతిర్లింగం దేవాలయానికి గతంలోనే 16 లక్షల రూపాయల విరాళం అందించడం జరిగిందని.భవిష్యత్తులోనూ సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. దేవాలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శివ భక్తుల విజ్ఞప్తి మేరకు ఆలయం పరిధిలో సన్నిధానం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
