మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Hyderabad politics Telangana

పటాన్చెరు

మాజీ రాష్ట్రపతి, భారతరత్న, మిస్సైల్ మాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి   ఆయనకు ఘన నివాళులు అర్పించారు. పటాన్చెరు పట్టణంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో గల అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన దేశానికి చేసిన సేవలు స్మరించుకున్నారు. నిరుపేద కుటుంబం నుండి ప్రారంభమైన అబ్దుల్ కలాం ప్రస్థానం తన మేధాశక్తితో ప్రపంచ స్థాయిలో దేశాన్ని గర్వపడే స్థాయికి తీసుకుని వెళ్లారని అన్నారు.

అబ‍్దుల్‌ కలాం భారత్‌లోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన వారిలో ఒకరని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనను ఎంతోమంది ఆరాధించారని గుర్తుచేసుకుంటారని అన్నారు. దేశానికి మాజీ రాష్ట్రపతి కలాం చేసిన కృషి వెలకట్టలేనిదని, ఆయన సేవలు చిరస్మరణీయమని గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన స్వభావం ఎందరికో మార్గనిర్దేశం. ‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి’ అని కలాం చెప్పిన మంచి మాట యువతలో ఆత్మవిశ్వాసం నింపుతుంది. పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ వరకు సాగిన ఆయన జీవన ప్రస్థానం యువతరానికి స్ఫూర్తిదాయకంఅన్నారు. ఒక శాస్త్రవేత్తగా జీవితాన్ని ప్రారంభించినఅబ‍్దుల్‌ కలాం  తర్వాత అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌కు ఎన్నో ఎనలేని విజయాలు అందించారని నిరాడంబర జీవితం గడిపి రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చారు. ఈ మహోన్నత వ్యక్తి సేవల్ని భారత జాతి ఎన్నటికీ మరిచిపోలేమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, బస్వేశ్వర్, వెంకటేష్, షకీల్, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *