దేవాలయాల భూముల పరిరక్షణకు కృషి _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

మనవార్తలు , అమీన్పూర్:  

_బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి

_దేవాలయం భూముల పరిరక్షణకు కోటి 30 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ

ప్రసిద్ధ శైవ క్షేత్రమైన బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం పరిధిలోని 34 ఎకరాల భూముల పరిరక్షణ కోసం కోటి 30 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శనివారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోట్లాది రూపాయల విలువైన భూములను పరిరక్షించడంలో భాగంగా ప్రహరీ గోడ నిర్మిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో దేవాలయాల విస్తరణలో భాగంగా విలువైన భూములు ఉపయోగపడతాయని తెలిపారు. దేవాలయ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని రుద్రారం సిద్ధిగణపతి, గుంతపల్లి వీరభద్ర స్వామి దేవాలయాల భూముల పరిరక్షణ సైతం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ తులసి రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఆలయ కమిటీ డైరెక్టర్లు, ఆలయ ఈఓ శశిధర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *