పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టారని, పూర్తి పారదర్శకతతో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో.. హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఇందిరమ్మ నమూనా గృహ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత స్థలం కలిగి ఉన్న నిరుపేదలకు ఇల్లు నిర్మించుకునేందుకు ఐదు లక్షల రూపాయల సహాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇంటింటి సర్వే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. మూడు విడతల్లో లబ్ధిదారుడికి నిధులు మంజూరు అవుతాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ హౌసింగ్ పీడీ చలపతిరావు, ఎంపీడీవో యాదగిరి, డి ఈ రవీందర్, ఏఈ సత్యనారాయణ, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, విజిలెన్స్ కమిటీ సభ్యులు చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.