13 లక్షల రూపాయల విరాళం
అమీన్పూర్
అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామ పరిధిలోని మైత్రి విల్లాస్ లో మంగళవారం నిర్వహించిన శ్రీ సిద్ధి వినాయక గణపతి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ ఆలయ నిర్మాణానికి 13 లక్షల రూపాయలు విరాళం అందించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కృష్ణ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఈర్ల రాజు, రాజు, గ్రామ ప్రముఖులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

