Telangana

ఇస్నాపూర్ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ పరిధిలోని మత్స్యకారుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం అందించడంతో పాటు, మత్స్యకారుల సొసైటీలో నూతన సభ్యత్వానికి కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం పటాన్చెరు పట్టణంలోని ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో ఇస్నాపూర్ మత్స్యకార సహకార సంఘం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇస్నాపూర్ గ్రామ పరిధిలోని వివిధ చెరువుల పరిధిలోగల మత్స్యకార సహకార సంఘంలో నూతన సభ్యత్వం అందించడం గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామ పరిధిలోని పెద్ద చెరువు చేప పిల్లల పెంపకానికి అనువుగా లేదని సంబంధిత కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు నివేదిక ఇవ్వడం మూలంగా, చేప పిల్లలు పంపిణీ చేయడం లేదని మత్స్యశాఖ జిల్లా అధికారి నరసింహారావు ఎమ్మెల్యే జిఎంఆర్ కి తెలిపారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. చేపల పెంపకం పైన పూర్తిగా ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న ముదిరాజ్ సంఘం సభ్యులు ఆర్థికంగా నష్టపోతారని, పెద్ద చెరువు కాలుష్యంపై సమగ్ర నివేదిక అందించాలని పిసిబి అధికారి గీతను ఆదేశించారు. పెద్ద చెరువుకు సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సభ్యత్వం అందించాలని అధికారులను ఆదేశించారు. పిసిబి నివేదిక అనంతరం పెద్ద చెరువు పరిధిలోని పరిశ్రమల ద్వారా మత్స్యకారులందరికీ ప్రతి ఏటా నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం రామచంద్రాపురం రాయసముద్రం చెరువు పరిధిలోని మత్స్యకార సహకార సంఘం సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ డి ఈ రామ స్వామి, ఇస్నాపూర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాఘవేందర్, వైస్ ప్రెసిడెంట్ గోపాల్, సలహాదారులు పెంటయ్య, నర్సింలు, రవీందర్, రామచంద్రాపురం ముదిరాజ్ సంఘం సభ్యులు శ్రీశైలం, రాములు, వెంకట్, గాంధీ శ్రీను, పెద్ద రాజు, టెంట్ హౌస్ శ్రీను, ఉమ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

16 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

17 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago