రంజాన్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని జిఎంఆర్ యువసేన నాయకుడు షకీల్ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ను శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజులపాటు కఠినంగా ఉపవాస దీక్షలు చేస్తూ అల్లాను ప్రార్థిస్తూ నిర్వహించే పవిత్ర మాసం రంజాన్ మాసం అన్నారు. నియోజకవర్గంలోని మైనార్టీల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామని తెలిపారు. సొంత నిధులతో నూతన మసీదులు, ఈద్గాలు, ఆశిర్ఖానాలు నిర్మించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మైనారిటీ మత పెద్దలు పాల్గొన్నారు.