ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా దివ్యాంగులకు పరికరాల పంపిణీ
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం, ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు సర్కిల్ పరిధిలోని 3 డివిజన్లకు సంబంధించిన 225 మంది దివ్యాంగులకు 17 లక్షల 97 వేల రూపాయలతో కొనుగోలు చేసిన వినికిడి యంత్రాలు, వీల్ చైర్లు, చేతి కర్రలు, ట్రై సైకిళ్లను స్థానిక ప్రజాప్రతినితో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శారీరక లోపాలను అధిగమించి నేడు దివ్యాంగుల సైతం అన్ని రంగాల్లో దూసుకొని వెళ్తున్నారని తెలిపారు. ఆత్మవిశ్వాసానికి ప్రతీక దివ్యంగులని అన్నారు. నియోజకవర్గంలోని దివ్యాంగుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. గతంలో 400 మంది దివ్యాంగులకు నాలుగు కోట్ల రూపాయల సొంత నిధులతో ద్విచక్ర వాహనాలను అందించామని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, సిఐ వినాయక్ రెడ్డి, అఫ్జల్, తదితరులు పాల్గొన్నారు.
