పటాన్ చెరు
రేపటినుండి పాఠశాలలు, కళాశాలలు, ప్రారంభం కానున్న నేపథ్యంలో పటాన్చెరువు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలలను పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పరిశీలించారు. పాఠశాలలో చేపడుతున్న పనులను స్వయంగా తనిఖీ చేశారు.. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలో నిర్వహణ చేపట్టాలని సూచించారు. ప్రతి విద్యార్థికి కరోనా నిబంధనలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. ప్రతి పాఠశాలలో ఆరోగ్యకరమైన పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే వెంట స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, ఎం ఈ వో రాథోడ్, ఆయా పాఠశాలలు, కళాశాలల సిబ్బంది, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, విజయ్ కుమార్, జగన్, సందీప్, తదితరులు పాల్గొన్నారు