_సీసీ కెమెరాలతో మరింత నిఘా
మనవార్తలు , పటాన్ చెరు:
పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకత పెరిగిందని, అవసరమైన ప్రతిచోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం పటాన్ చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో లక్షా ఇరవై వేల రూపాయలతో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను డిఎస్పి భీమ్ రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
డిఎస్పి భీమ్ రెడ్డి మాట్లాడుతూ నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్యమైన ప్రదేశాల్లో సిసి కెమెరాల ఏర్పాటుకు ఎమ్మెల్యే జిఎంఆర్ తీసుకుంటున్న చొరవను ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, సీఐ వేణుగోపాల్రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, విజయ్ కుమార్, పట్టణ ప్రముఖులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.