మనవార్తలు ,పటాన్ చెరు :
పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి తన దైవభక్తిని చాటుకున్నారు. కొండాపూర్ మండలం హరిదాస్ పూర్ గ్రామ పరిధిలోని పెద్దమ్మ గడ్డ తండా లో నిర్మిస్తున్న శ్రీ భవాని మాత మరియు శ్రీ సేవాలాల్ మహారాజ్ దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేయనున్న ధ్వజస్తంభం ఏర్పాటుకు పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు తన సోదరుడు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి గారి ద్వారా రెండు లక్షల 55 వేల రూపాయల విరాళం అందించారు.దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని, దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.