Hyderabad

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దళిత వ్యతిరేకి – పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్

పటాన్ చెరు:

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దళిత వ్యతిరేకి అని, పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత నెల 29వ తేదీన అమీన్ పూర్ మండల సర్వసభ్య సమావేశం సందర్భంగా సుల్తాన్ పూర్ ఎంపీటీసీ మధురవేణి దేవదానం గ్రామ సమస్యల పరిష్కారం కొరకు స్థానిక ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇవ్వబోగా, ఎమ్మెల్యే ఆ వినతి పత్రాన్ని తీసుకోకుండా కింద పడవేశారని అన్నారు. ఒక దళిత ప్రజాప్రతినిధి వినతిపత్రం ఇస్తే తీసుకోకపోవడం ఎమ్మెల్యే అహంకారానికి పరాకాష్ట అని పేర్కొన్నారు.

ప్రజా ప్రతినిధులు పోచారం సర్పంచ్ జగన్, ఐలాపూర్ రవి, భానూర్ శాంతయ్య లను కూడ గతంలో అవహేళన చేసి మాట్లాడారని ఆరోపించారు. ఎమ్మెల్యేకు మహిళలంటే గౌరవం లేదని, మాట్లాడే భాషను కూడా మార్చుకోవాలని సూచించారు. దీనికి తోడు నాలుగవ స్తంభం అయినా పలువురు మీడియా వ్యక్తులపై కూడా ఎమ్మెల్యే దుర్భాషలాడారని దుయ్యబట్టారు. వెంటనే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎంపీటీసీ మధురవేణికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

అదేవిధంగా హుజూరాబాద్ లో ప్రకటించిన దళిత బందును, స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు మంజూరు చేయించాలని చెప్పారు. దళిత బందును ఇప్పించని ఎడలా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్, బొల్లారం మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి, కౌన్సిలర్ లావణ్య శశిధర్ రెడ్డి, సుల్తాన్ పూర్ ఎంపీటీసీ మధురవేణి దేవదానం, ఇస్నాపూర్ ఉపసర్పంచ్ శోభా, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కె.నర్సింహారెడ్డి, తెల్లాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పర్స శ్యామ్ రావు, నాయకులు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి, హరి పంతులు, పట్టోళ్ల భాస్కర్ రెడ్డి, లింగంగౌడ్, దుద్యాల రవీందర్, రవిగౌడ్, దండోరా నరసింహా, సామయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 days ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

3 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

3 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

4 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

4 days ago