_తెలుగు భాషాభివృద్ధికి, సాహిత్య వికాసానికి
_కవి సమ్మేళనం దోహదం చేస్తుంది:
_పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
తెలుగు భాషాభివృద్ధికి సాహిత్య వికాసానికి కవి సమ్మేళనలు దోహదం చేస్తాయని పటాన్ చెరు శాసన సభ్యులు మాన్యశ్రీ గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.తెలుగు వెలుగు సాహిత్య వేదిక,ఎస్ వీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సాహిత్య సంబరాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఆరు రాష్ట్రాల నుంచి ఆరువందల మందికి పైగా కవులు పాల్గొనే జాతీయ సాహిత్య సంబరాలలో శతాధిక కవి సమ్మేళనం, ,, కవులకు, కళాకారులకు సత్కార కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ముఖ్యంగా తెలుగు భాషాభివృద్ధికి, సాహిత్య వికాసానికి దోహదం చేసే విధంగా జాతీయ స్థాయిలో జరిగే సాహిత్య సంబరాలను విజయవంతం చేయాలని తెలిపారు. ఆయా రాష్ట్రాల నుంచి తరలివచ్చే ,కవులకు, సాహితీ వేత్తలకు, కళాకారులకు సత్కారాలు ఉంటారని, ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే కవులు రచించిన పలు సాహిత్య పుస్తకాలు దాదాపు 50కి పైగా కవితా సంపుటి పుస్తకాలు ఆవిష్కరణలు జరుగుతాయని తెలిపారు.
పటాన్ చెరులోని జీహెచ్ఎంసీ మల్టిపర్ఫస్ ఫంక్షన్ హాల్ లో ఈనెల 30 వ తేదిన ఎస్ వీ ఫౌండేషన్, తెలుగు వెలుగు సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించబోయే కవి సమ్మేళనానికి దేశంలోని ప్రధాన రాష్ట్రాలు మన తెలంగాణ తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి తదితర రాష్ట్రాల నుంచి తెలుగు కవులు విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమానికి స్ధానింగా కవులు, కళాకారులు,, ప్రజాప్రతినిధులు, ప్రజలు విచ్చేసి జాతీయ సాహిత్య సంబరాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.. జాతీయ సాహిత్య సంబరాలలో భాగంగా పలు కార్యక్రమాలు ఉంటాయని వాటి వివరాలను వెల్లడించారు.
కార్యక్రమాలు ఇలా..
జాతీయ సాహిత్య సంబరాలలో భాగంగా
సాహిత్య ర్యాలీ : ఉదయం 8 గంటలకు పటాన్ చెరు లోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన 8:45 నిముషాలకు వేదిక వద్దకు చేరుకుంటుంది..
8:45 నిముషాలకు కవి సమ్మేళనం ప్రారంభ సభ
ఎమ్మెల్యే గారు. ఇతర సాహిత్య వేత్తలు జ్యోతి వెలిగింది ప్రారంబిస్తారు.
ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 3: 45 గంటల వరకు జాతీయ కవి సమ్మేళనం జరుగుతుంది.
3:45 గంటల నుంచి 4గంటల వరకు సాంస్కృతిక ప్రదర్శనలు
4గంటలకు ముగింపు సభ
కవులకు పురస్కారాలు, పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమానికి స్ధానిక కవులు, రచయితలు, కళాకారులు,ప్రజలు,, ప్రతినిధులు విచ్చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, తెలుగు వెలుగు సాహిత్య వేదిక కవులు ట్యాగ్ లైన్ కింగ్ ఆలపాటి, సాదనాల వేంకట స్వామి నాయుడు, మోటూరి నారాయణరావు, జేవి కుమార్ చేపూరి, మేడిశెట్టి యోగేశ్వరరావు, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు