పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం గణపతి గూడెం గ్రామంలో ఈనెల 25, 26 తేదీలలో నిర్వహించనున్న శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవాల ఆహ్వాన పత్రికను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జగన్, ఎంపీటీసీ మమతా బిక్షపతి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.