అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి :
రైతు కుటుంబ పోషణలో అండగా నిలిచే గోసంపదను రైతులకు అందించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట, సుల్తాన్పూర్ గ్రామాలతో పాటు గుమ్మడిదల మండల పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన రైతులకు బీరంగూడ గోశాల నుండి గోశాల నిర్వాహకులతో చేర్చించి 40 ఆవులను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో గుమ్మడిదల మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు సంబంధించిన బర్రెలు ఆవులు వివిధ కారణాలతో మృతి చెందాయని తెలిపారు. దీని మూలంగా రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. వారిని ఆదుకోవాలన్న మానవతా దృక్పథంతో గోవులను పంపిణీ చేయాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు 40 గోవులను అందించామని, త్వరలోనే మరిన్ని పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనంతరం గోశాల నిర్వాహకులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, కృష్ణారెడ్డిపేట సర్పంచ్ కృష్ణ, తాసిల్దార్ దశరథ్, ఎంఈఓ రాథోడ్, సీనియర్ నాయకులు రాజు, గోశాల నిర్వాహకులు దామోదర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.