మనవార్తలు ,పటాన్ చెరు:
నిరుపేద ప్రజలకు మెరుగైన చికిత్స అందించడంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారతి నగర్ డివిజన్ పరిధిలోని ముగ్గురు లబ్ధిదారులకు మంజూరైన ఒక లక్ష 34 వేల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, భారతి నగర్ డివిజన్ అధ్యక్షులు పృథ్విరాజ్, కునాల్ తదితరులు పాల్గొన్నారు.