ఐదు మున్సిపాలిటీలలో గులాబీ జెండా ఎగరేస్తున్నాం ఎమ్మెల్యే జిఎంఆర్

politics Telangana

కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండండి

కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో మాజీ మంత్రివర్యులు కేటీఆర్, హరీష్ రావుల నాయకత్వంలో పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలలో గులాబీ జెండా ఎగురవేసి కేసిఆర్ గారికి గిఫ్టుగా అందిస్తామని పటాన్‌చెరుశాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.గురువారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గం పరిధిలోని ఇంద్రేశం, ఇస్నాపూర్, గడ్డపోతారం, జిన్నారం, గుమ్మడిదల మున్సిపాలిటీలలో బిఆర్ఎస్ నుండి బరిలో దిగిన కౌన్సిలర్ అభ్యర్థులు, సీనియర్ నాయకులు, కౌంటింగ్ ఏజెంట్లతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు జరగనున్న మున్సిపల్ ఓట్ల లెక్కింపు లో కౌన్సిలర్ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు నిర్దేశించిన సమయంలో గా హాల్ లోకి వెళ్లాలని సూచించారు. కౌంటింగ్ జరిగే సమయంలో ప్రతి ఓటును నిశితంగా పరిశీలించాలని ఏదైనా సందేహం అనిపిస్తే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాలని తెలిపారు.

గెలుపు ధ్రువీకరణ పత్రం అందించే వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధిష్టానం సూచనలకు అనుగుణంగా గెలిచిన అభ్యర్థులందరూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపులకు చేరుకోవాలని కోరారు. ప్రతిపక్ష పార్టీల ప్రలోభాలకు ఎట్టి పరిస్థితిలో లోను కాకూడదని అధిష్టాన నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే పదవి కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రతి మున్సిపల్ పరిధిలోని సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు అభ్యర్థులతో సమన్వయం చేసుకోవాలని కోరారు. బూటకపు హామీలు. మోసపూరిత ప్రకటనలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గడచిన రెండున్నర సంవత్సరాలుగా ప్రజలకు చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. 6 గ్యారంటీలను అమలు చేయకపోవడంతో పాటు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ధి సంక్షేమాలను తుంగలో తొక్కిందని ఆరోపించారు.

ప్రజలు తిరిగి కేసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఇందుకు అనుగుణంగానే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, డిసిసిబి మాజీ వైస్ చైర్మన్ మాణిక్యం, మాజీ ప్రజా ప్రతినిధులు శంకర్ యాదవ్, సపాన దేవ్, సుధాకర్ రెడ్డి, బాల్ రెడ్డి. గోవర్ధన్ రెడ్డి. కుమార్ గౌడ్. వెంకటేష్, అంజయ్య యాదవ్, దేవానందం, తుమ్మల పాండురంగ రెడ్డి, యాదగిరి యాదవ్, శ్రీశైలం యాదవ్, సుధాకర్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, విజయ్ కుమార్, దశరథ్ రెడ్డి, నరసింహ గౌడ్, పృథ్వీరాజ్, లియకత్, హమీద్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *