మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకొని ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారంలో గల గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయాన్ని గురువారం ఉదయం పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజలందరి సహకారంతో పటాన్‌చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన కాలమానిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు డిఎస్పి ప్రభాకర్, ఆలయ కమిటీ అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీపీ గాయత్రి పాండు, సిఐలు వినాయక రెడ్డి, నరేష్, రవీందర్ రెడ్డి, రమణా రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు రాజు, వెంకన్న, నరసింహ రెడ్డి, నాగరాజు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
