పటాన్చెరు
శ్రీ దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని పటాన్చెరు లోని మహంకాళి దేవాలయంలో పటాన్చెరు శాసనసభ్యులు శ్గూడెం మహిపాల్ రెడ్డి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించారు. అమ్మవారి అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, కార్పోరేటర్లు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, మాజీ కార్పొరేటర్ సపన దేవ్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, అశోక్, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.