లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అధికారులతో సమీక్ష
రాబోయే 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం తరఫున అత్యవసర సహాయక చర్యలు చేపడుతున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలతో పాటు, సాకి చెరువు, చిన్న వాగు, పాటి గ్రామ చౌరస్తాలోని సబ్ స్టేషన్ తదితర ప్రాంతాలను జిహెచ్ఎంసి విశాఖ అధికారులతో కలిసి పర్యటించారు. డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టడంతో పాటు నీరు చేరే అవకాశం ఉన్న ఇళ్లలోని ప్రజలను తరలించాలని ఆదేశించారు. జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఇప్పటికే అత్యవసర రక్షణ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీసులను లేదా జిహెచ్ఎంసి అధికారులను సంప్రదించాలని కోరారు. అనంతరం రామచంద్రపురం లో పర్యటించి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఇల్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకైతే ఇటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు.