పటాన్చెరు
పటాన్చెరు మండలం పెదకంజర్ల గ్రామంలో వచ్చే నెల ఏడో తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ శ్రీ శ్రీ దుర్గాదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను శనివారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజ్ కుమార్, ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ హరిశంకర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ గోపాల్ రెడ్డి, సత్యం పంతులు, గ్రామ పంచాయతి పాలక వర్గం సభ్యులు, గ్రామ పుర ప్రముఖులు పాల్గొన్నారు.