పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
క్రీడా రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, పటాన్చెరును క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు మండలం పాటి గ్రామంలో జై భజరంగ్ బలి కబడ్డీ టీం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి ఓపెన్ టు ఆల్ కబడ్డీ టోర్నమెంట్ పోటీలను శుక్రవారం రాత్రి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడా రంగానికి పెద్ద పీట వేయడంతో పాటు, క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపారు.
పటాన్చెరు నియోజకవర్గం లో క్రీడల అభివృద్ధి కోసం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఐదు ఎకరాల సూచనలతో మూడు మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు. దశాబ్దాల చరిత్ర కలిగిన పటాన్చెరువు మైత్రి మైదానాన్ని ఇటీవల ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర, జాతీయ పోటీలకు మైత్రి మైదానం వేదికగా నిలుస్తుందని తెలిపారు. విద్యార్థి దశ నుండే క్రీడ రంగం పట్ల శ్రద్ధ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ లక్ష్మణ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, స్వామి గౌడ్, గ్రామ ప్రజా ప్రతినిధులు, నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.