రైతు పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించండి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రైతు సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం ముత్తంగి, పటాన్చెరు పట్టణంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సహకార సంఘాల ఆవరణలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో సన్న వడ్లకు మద్దతు ధరకు అదనంగా 500 రూపాయల బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు. ఏవన్ గ్రేడ్ క్వింటాలుకు 2320, సన్న వడ్లకు క్వింటాలకు 2820 రూపాయలు మద్దతు ధర అందిస్తుందని తెలిపారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని.. దళారులకు విక్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని కోరారు. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా 10 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్లు రాఘవేంద్రారెడ్డి, బిక్షపతి, ముత్తంగి మాజీ సర్పంచ్ ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, డైరెక్టర్లు, అధికారులు, సీనియర్ నాయకులు, పాల్గొన్నారు.