మనవార్తలు ,పటాన్ చెరు:
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మన ఊరి మన బడి పథకంలో భాగంగా నియోజకవర్గంలో చేపడుతున్న పనుల పురోగతిపై నియోజకవర్గ పరిధిలోని వివిధ శాఖల అధికారులతో మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో గా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి విడతలో 54 పాఠశాలను ఎంపిక చేయడం జరిగిందని, రెండో విడతలో మిగతా పాఠశాలల్లో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. దసరా పండుగను పురస్కరించుకొని.. ప్రభుత్వం ప్రతి ఏటా అందించే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. అభివృద్ధి పనుల విషయంలో తాత్సారం చేయవద్దని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.