మనవార్తలు ,పటాన్ చెరు
వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణం, మండల పరిధిలోని వివిధ ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పటాన్చెరు పట్టణంలోని ఆల్విన్ కాలనీ లో గల వెంకటేశ్వర ఆలయం, లక్డారం గ్రామంలోని అత్యంత పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా దేవాలయాల కమిటీ సభ్యులు ఎమ్మెల్యేనీ ఘనంగా సన్మానించారు.
పటాన్చెరు పట్టణంలోని జెపి కాలనీ లో శ్రీ వెంకటేశ్వర మంత్ర పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన వెంకటేశ్వర స్వామి కళ్యాణం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాణిక్ రెడ్డి, విజయ్ కుమార్, అఫ్జల్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.