పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకుని..ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. అనంతరం జేపీ కాలనీలో.. సీసాల రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ శ్రీనివాస కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్నారు..ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
