ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో పార్టీ ప్లీనరీ, విజయ గర్జన సభలపై సన్నాహక సమావేశం

Hyderabad Telangana

విజయ గర్జనకు ప్రతి కార్యకర్త తరలిరావాలి

పటాన్చెరు

అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారుతున్న ప్రస్తుత తరుణంలో వచ్చే నెల నవంబర్ 15వ తేదీన వరంగల్ లో నిర్వహించనున్న విజయ గర్జన సభను చరిత్ర సృష్టించేలా నిర్వహిద్దమని, ప్రతి గ్రామం నుండి కార్యకర్తలందరూ ఓరుగల్లు సభకు తరలిరావాలని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా , ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ప్లీనరీ, విజయ గర్జన సభలపై నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ భాద్యులతో తో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా ఉద్యమ పార్టీగా అవతరించిన టిఆర్ఎస్ పార్టీ ఏర్పడి 20 సంవత్సరాలు గడుస్తున్న శుభ సందర్భంగా పార్టీ ద్వి దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోందన్నారు. ఈనెల 25వ తేదీన గచ్చిబౌలిలోని హైటెక్స్ లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ప్లీనరీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఈ సమావేశానికి 119 నియోజకవర్గాల నుండి ఆరు వేల మంది ప్రతినిధులను ఆహ్వానించడం జరిగిందని పేర్కొన్నారు. నవంబర్ 15వ తేదీన వరంగల్ లో తెలంగాణ విజయ గర్జన సభను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నలుమూలల నుండి 10 లక్షల మంది కార్యకర్తలు వచ్చేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గం నుండి వచ్చే కార్యకర్తల కోసం 150 బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విజయ గర్జన సభ రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రతి గ్రామంలో జెండా ఎగురవేసి, ప్రతి బస్సుకు పార్టీ బ్యానర్ కట్టి మధ్యాహ్నం 1:00 లోపు వరంగల్ చేరుకునేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని సూచించారు.

ప్రతి గ్రామం నుండి పార్టీ గ్రామ కమిటీ సభ్యులు అందరూ వచ్చేలా చూడాలని పార్టీ బాధ్యులకు ఆదేశించారు. విజయ గర్జన సభ విజయవంతం చేయడానికి ఈ నెల 27వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈలోపు 22వ తేదీ నుండి 26వ తేదీ వరకు గ్రామ మండల డివిజన్ మున్సిపల్ స్థాయి పార్టీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.

 

ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య వారధిగా పని చేయండి

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ప్రతి కార్యకర్త వారధిగా పని చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రజలతో నేరుగా సత్సంబంధాలు ఉన్నప్పుడే కిట్టి పార్టీకి అటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. పార్టీ ఇచ్చే ప్రతి పిలుపును గ్రామస్థాయి నుండి విజయవంతం చేయాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మరోమారు తెలిపారు. ఒకవైపు పార్టీ పటిష్టతకు కృషి చేస్తూనే మరోవైపు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును సమీక్షించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. రాబోయే తొమ్మిది నెలల పాటు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిరంతర శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు..

 

 

సభను విజయవంతం చేస్తాం..

ఎమ్మెల్యే జిఎంఆర్

పార్టీ ప్లీనరీ, విజయ గర్జన సభలను విజయవంతం చేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ అవలంభించాల్సిన విధి, విధానాలు, ప్లీనరీ, విజయ గర్జన సభ తదితర అంశాలపై మంత్రి కేటీఆర్ పలు సూచనలు చేశారని ఆయన తెలిపారు. ఈనెల 22వ తేదీ నుండి ఇ నాలుగు రోజులపాటు గ్రామ, మండల, మున్సిపల్, డివిజన్ స్థాయి పార్టీ సమావేశాలు నిర్వహించనున్నట్లు, తెలిపారు. అనంతరం 27వ తేదీన నియోజకవర్గస్థాయి పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఆత్మ కమిటీ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, మండల, డివిజన్, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *