మనవార్తలు ,పటాన్చెరు
మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు అయినటువంటి శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. శుక్రవారం పటాన్చెరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సమాజానికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా అతి పిన్నవయసులో స్వరాష్ట్ర సాధనకై అమరుడైన గొప్ప వ్యక్తి శ్రీకాంత్ చారి అని కొనియాడారు.
ప్రత్యేక తెలంగాణ కోసం అమరులైన విద్యార్థుల ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్చెరు జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, రామచంద్రపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్,టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, వెంకటేష్ గౌడ్, విజయ భాస్కర్ రెడ్డి, రాజేష్, షేక్ హుస్సేన్, పాండు, మన్నే రాజు, మహేష్, ప్రమోద్ గౌడ్, కృష్ణ మూర్తి, తారా సింగ్, తదితరులు పాల్గొన్నారు.