పటాన్చెరు
పటాన్చెరు మండలం పెదకంజర్ల గ్రామంలో గురువారం నిర్వహించిన శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి, విజయ్ కుమార్, దేవాలయ ధర్మకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.