పటాన్చెరు
పటాన్చెరు మండలం రుద్రారం సిద్ధి గణపతి ఆలయంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన రథోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే జిఎంఆర్ స్వయంగా రథం లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ నర్సింహ రెడ్డి, సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీ రాజు, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపిపి యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, పార్టీ మండల అధ్యక్షులుపాండు, ఆలయ కమిటీ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
