మనవార్తలు,పటాన్ చెరు:
పటాన్ చెరు మండలం పోచారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేనీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, యాదగిరి యాదవ్, విజయ్ కుమార్, బిక్షపతి, స్థానిక ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.