శ్రీ పంచముఖి హనుమాన్ దేవాలయం భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్
అమీన్పూర్
అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్ గూడ గ్రామం బీహెచ్ఈఎల్ మెట్రో ఎన్క్లేవ్ లో నిర్మించ తలపెట్టిన శ్రీ పంచముఖి హనుమాన్ దేవాలయం భూమి పూజలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పురాతన దేవాలయాల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు, నూతన ఆలయాల నిర్మాణాలకు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభవృద్దికి పెద్ద పీట వేశారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, సర్పంచ్ నితీష శ్రీకాంత్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, కార్మిక నాయకులు ఎల్లయ్య,
స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.