పటాన్ చెరు
పటాన్చెరు మండలం లక్డారం గ్రామంలో వెలసిన అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా బుధవారం నిర్వహించిన కల్యాణోత్సవంలో పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సువర్ణ మాణిక్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, గ్రామ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.