మనవార్తలు ,జిన్నారం
మండల కేంద్రమైన జిన్నారం లో ఆదివారం నిర్వహించిన శ్రీ కోదండ సీతారామస్వామి శోభాయాత్ర లో పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రంగనాయక స్వామి గుట్టపై నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, వెంకటేష్ గౌడ్, సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు రాజేష్, సీనియర్ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
