మనవార్తలు ,పటాన్ చెరు:
పటాన్చెరు మండలం బానూరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ పండుగలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, గ్రామస్తులు, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.