అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి :
అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ నివాసంలో సోమవారం నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం బీరంగూడ గుట్ట పైన శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వృద్ధాశ్రమం పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ తులసిరెడ్డి, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, స్థానిక కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.