భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదే
మనవార్తలు , పటాన్ చెరు:
పెరుగుతున్న కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలంటే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలని, ఇందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా రాయితీలు ఇస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వాహనాల షోరూంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.
రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుందని అన్నారు. పటాన్చెరు పట్టణ ప్రజల కోసం ఎలక్ట్రిక్ వాహనాల షోరూం ప్రారంభించడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, కౌన్సిలర్ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.