_టీఎస్ ఐ ఐ సి భూములను స్థానిక అవసరాల కోసం బదలాయించండి
_సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్
మనవార్తలు ,పటాన్ చెరు;
రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు.పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం, భారతీ నగర్, పటాన్చెరు డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని కోరారు. ప్రధానంగా సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, పేపర్ అభివృద్ధి పనులకు 100 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు అందించినట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు.ఉస్మానగర్, వెలిమెల, సందు గూడెం, పాశమైలారం పరిధిలోని టీఎస్ఐఐసి భూములను స్థానిక అవసరాల కోసం బదలాయించాలని విజ్ఞప్తి చేశారు.ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్, త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు.ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.