మనవార్తలు ,పటాన్ చెరు:
మానవాళికి ఏసుక్రీస్తు జీవితం స్ఫూర్తిదాయకమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని క్రిస్టియన్ సొసైటీ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని మైత్రి క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జిఎంఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని సర్వ మతాల సారాంశం ఒక్కటేనని, ఎవరు తమ మతాన్ని ప్రేమించడం తో పాటు ఇతరుల మతాన్ని గౌరవించాలని కోరారు. మానవ సేవయే మాధవ సేవ అన్న సూక్తికి అనుగుణంగా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే గొప్ప మానవత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, క్రైస్తవ సోదరులు, ఆయా చర్చిల పాస్టర్లు, పాల్గొన్నారు.