పటాన్చెరు,,మనవార్తలు ప్రతినిధి :
నియోజకవర్గం లోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని హజ్రత్ సయ్యద్ మురాద్ అలీషా దర్గా, హజ్రత్ సయ్యద్ నిజాముద్దీన్ షా దర్గా, చోటా మసీద్ ప్రాంగణాల్లో 4 లక్షల 50 వేల రూపాయల సొంత నిధులతో ఏర్పాటుచేసిన 40 సీసీ కెమెరాలను సోమవారం స్థానిక నాయకులు, మైనార్టీ మత పెద్దలతో కలిసి ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, వీటి ద్వారా అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయడంతో పాటు నేరాలను నియంత్రించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ లాలూ నాయక్, బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, ముస్లిం మత పెద్దలు లియాకత్ అలీ, వాజిద్ అలీ, అజ్మత్, ఇక్బాల్, మోయిన్, అతీక్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.