మాధవపురి హిల్స్ లో పార్క్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

Hyderabad Telangana

అమీన్పూర్

మాధవపురి హిల్స్ కాలనీ లో ఏర్పాటుచేసిన పార్కు నిర్మాణానికి కాలనీవాసులు స్వచ్చందంగా విరాళాలు అందజేయడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఐదవ వార్డు మాధవపురి హిల్స్ కాలనీ లో 70 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన పార్కును స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎకరా విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆధునిక హంగులతో పార్కును ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు.

ప్రభుత్వ నిధులతో పాటు కాలనీ వాసులు అందరూ ఒక్కతాటిపై నిలిచి పెద్ద ఎత్తున విరాళాలు అందించడం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. త్వరలోనే సొసైటీ భవనాన్ని సైతం పూర్తి చేస్తామని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలవక ముందు కాలనీలో గల ఆలయం అభివృద్ధికి విరాళం అందించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సమిష్టి కృషితోనే అద్భుతమైన విజయాలు సాధ్యమవుతాయని అన్నారు. ఈ సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మున్సిపల్ కమిషనర్ సుజాత, స్థానిక కౌన్సిలర్ మహదేవ రెడ్డి, కౌన్సిలర్లు నవనీత జగదీష్, చంద్రకళ గోపాల్, బిజిలీ రాజు, మల్లేష్, కల్పన ఉపేందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *