పటాన్ చెరు
పటాన్చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ లో ఏర్పాటుచేసిన కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాన్ని శనివారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, డివిజన్ల పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా సాగుతుందని తెలిపారు. మొదటి డోసు ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 90 శాతం పూర్తయిందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన మరోమారు కోరారు. కరోనా వ్యాధి తగ్గుముఖం పట్టిందని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదని, తప్పనిసరిగా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించి శానిటైజర్ ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, నరసింహ, ప్రమోద్ గౌడ్, షకీల్, తదితరులు పాల్గొన్నారు