ఇక్రిసాట్ లో ఎమ్మెల్యే జిఎంఆర్

politics Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఇక్రిసాట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై వారు చర్చించారు. హ్యాట్రిక్ విజయం సాధించడం పట్ల అరవింద్ కుమార్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రాజు, కృష్ణ, గూడెం సంతోష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *