Categories: politics

అయ్యమ్మ చెరువు పరిస్థితిపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం

చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం

ప్రజల ప్రాణాలు పోతుంటే మీకు పట్టింపు లేదా

పిసిబి, నీటి పారుదల శాఖల అధికారులపై ఎమ్మెల్యే జిఎంఆర్ ఫైర్

ప్రకృతిని విధ్వంసం చేస్తే ప్రజా ఆగ్రహానికి గురి కాక తప్పదు

తీరు మార్చుకోకపోతే మూసుకోవాల్సిందే కాలుష్య కారక పరిశ్రమలకు ఎమ్మెల్యే జిఎంఆర్ అల్టిమేటం

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం :

ప్రజలకు ఉపాధి లభిస్తుందని పరిశ్రమల స్థాపనకు స్వాగతం పలికితే.. నేడు అవే పరిశ్రమలు ప్రజల ప్రాణాలు తీస్తూ ప్రతి రోజు కాలపూట విషాన్ని వెదజల్లుతున్నాయని తీరు మార్చుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హెచ్చరించారు. గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని చెట్ల పోతారం పరిధిలోగల అయ్యమ్మ చెరువు పరిస్థితిపై సోమవారము ఉదయం మున్సిపల్ పాలకవర్గం సభ్యులు, వివిధ శాఖల అధికారులతో కలిసి చెరువు కట్టపైనే ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా చెరువులో కాలుష్య జలాలు కలవడం మూలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే జిఎంఆర్ కు తెలిపారు. ప్రతి రోజు ప్రత్యక్ష నరకం అనుభవించడంతోపాటు క్యాన్సర్ లాంటి వ్యాధులు సోకి ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా తమ బతుకులు చిద్రమవుతున్నాయని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విన్నవించారు.

అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గడ్డపోతారం పరిధిలో పరిశ్రమల ఏర్పాటు ద్వారా స్థానికులకు ఉపాధి లభించడంతోపాటు ప్రజలు ఆర్థిక అభ్యున్నతి సాధిస్తారని పరిశ్రమల ఏర్పాటుకు అంగీకారం తెలిపితే నేడు అవే పరిశ్రమలు నిబంధనలు ఉల్లంఘిస్తూ స్థానిక చెరువులను తమ రసాయన జలాలతో కాలుష్యం చేస్తూ ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై వివిధ సందర్భాల్లో తీరు మార్చుకోవాలని పరిశ్రమల యాజమాన్యాలకు సైతం సూచించినప్పటికిని ఎలాంటి మార్పు కనిపించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. చెరువుల్లోకి కాలుష్య జలాలు వదలడం మూలంగా స్థానికంగా వ్యవసాయ రంగం పూర్తిగా విధ్వంసం కావడంతో పాటు పశుపక్షాదులు సైతం ప్రాణాలు కోల్పోతున్నాయని తెలిపారు. మహిళలకు వివిధ రకాల క్యాన్సర్లు సోకి నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలను వదిలివేసి వలసలు వెళ్లాల్సిన పరిస్థితిలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు.

ప్రజల కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని అవసరమైతే కాలుష్య పరిశ్రమలను తరిమికొడతామని హెచ్చరించారు.కాలుష్యాన్ని అరికట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమల పై ప్రజలు నేరుగా ఫిర్యాదులు ఇస్తున్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మీ నిర్లక్ష్యం చేతగానితనం మూలంగానే పరిశ్రమలు విచ్చలవిడిగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని అన్నారు.అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు. చెట్ల పోతారం నుండి కిష్టాయపల్లి, గండి చెరువు, కృష్ణారెడ్డిపేట చెరువు మీదుగా నక్క వాగు వరకు 6 ఫీట్ డయా పైపు లైన్ నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. చెరువు పరిధిలో కట్టుదిట్టమైన ఫెన్సింగ్ నిర్మాణం చేసి పశువులు వెళ్లకుండా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు.

స్థానికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న 14 పరిశ్రమలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి అయ్యమ్మ చెరువులోని కాలుష్య జలాలను పూర్తిగా తొలగించనున్నట్లు తెలిపారు.ప్రజల ప్రాణాల కంటే విలువైనది ఏమీ లేదని.. ఇక నుండి పరిశ్రమలు అప్రమత్తంగా ఉండాలని.. కాలుష్య జలాలను వదిలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కాలుష్య జలాలను వదులుతున్న పరిశ్రమలు సీజ్ చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో పిసిబి ఈఈ కుమార్ పాఠక్, నీటిపారుదల శాఖ ఈఈ భీమ్,గడ్డపోతారం మున్సిపల్ చైర్మన్ సుష్మ గణేష్, వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, గడ్డపోతారం మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య, సీఐ రవీందర్ రెడ్డి, జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, సీనియర్ నాయకులు బాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, నరసింహ, ప్రకాష్ చారి, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

admin

Recent Posts

పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన తెలంగాణ యువజన సంఘాల సమితి యువజన వికాస సమితి అధ్యక్షులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…

2 hours ago

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

23 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

1 day ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

3 days ago